
నెక్కొండ,నేటిధాత్రి:
గణతంత్ర దినోత్సవంను పురుస్కరినించుకుని వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్ మార్కెట్లో పనిచేస్తున్న గుర్తింపు పొందిన 63 మంది హమాలీలకు నూతన( డ్రెస్ కోడ్ )వస్త్రాలు పంపిణీ చేశారు. ఒక్క అడ్రస్ రెండు వేల రూపాయలు విలువ చేస్తుందని మొత్తం లక్ష 26 వేల రూపాయలు ఉంటుందని, మార్కెట్ అభివృద్ధికి ఖరీదు దారు లే కాకుండా మార్కెట్ ను అలాగే ఖరీదు దారులు అభివృద్ధి చేందడంలో కీలకపాత్ర హమాలీలు, దడ్వాయిల దేనని అందుకే వారిని ప్రభుత్వం గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన వస్త్రాలను పంపిణీ చేసిందని మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్ అన్నారు.కార్యక్రమంలో మార్కెట్ సూపర్వైజర్ అల్లి జ్యోతి ప్రకాష్, ఏ ఎం ఎస్ పోలేపాక భాస్కర్, మార్కెట్ సిబ్బంది పెండ్యాల శ్రీనివాస్, మహమ్మద్ రహీం, సెక్యూరిటీ ఇంచార్జ్, అలువాల యాకయ్య, దాడువాయిలు నరసయ్య, విజయేందర్, సురేష్, హమాలీ సంఘం నేతలు వెంకన్న, అశోక్, చిన్న వెంకన్న, చిన్నారి, తదితరులు పాల్గొన్నారు.