పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా ఫాక్ట్ కంపెనీ వరంగల్ జోనల్ మేనేజర్ బి.శివేంద్ర కుమార్ దోమతెరలు రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫాక్ట్ ఎరువులు 1947లో ఉద్యోగ మండల్ లో ఉత్పత్తిని ప్రారంభించారని ప్రస్తుతం 20-20-0-13,ఎంఓపి, 15-15-15,అమోనియా వంటి ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జోనల్ మేనేజర్ బి.శివేంద్ర కుమార్,అసిస్టెంట్ మేనేజర్ వి.విష్ణువర్ధన్ రెడ్డి,అరుణ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ యజమాని గందె వెంకటెశ్వర్లు,డీలర్ ఆనందం, రైతులు దగ్గు విజ్జన్ రావు, సుమారు 70 మంది వరకు పాల్గొన్నారు.