నడికూడ,నేటి ధాత్రి :
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చర్లపల్లి గ్రామానికి చెందిన కీ,శే, డాక్టర్ మాతృవల్లి లక్ష్మణమూర్తి జ్ఞాపకార్థం అతని కూతురు మంజుల అల్లుడు సత్యం సుమారు 5000 రూపాయలు విలువ చేసే మధ్యాహ్న భోజన ప్లేట్లు, పెన్సిల్స్, స్కేల్స్, రబ్బర్, షార్ప్నర్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ కీర్తిశేషులు లక్ష్మణ మూర్తి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొలం పెల్లి విజేందర్, నీగ్గుల శ్రీదేవి, కుటుంబ సభ్యులు సత్యం, మంజుల, రామచంద్రన్, సమ్మిరెడ్డి, కుమారస్వామి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య, పరువేణిని జ్యోతి, బాబురావు ఆయాలు అరుణ,సుశీల సరోజన పాల్గొన్నారు.