జైపూర్,నేటి ధాత్రి:
చెన్నూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు ఎంపీ గడ్డం వంశీకృష్ణ జైపూర్ మండల కేంద్రంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జైపూర్ మండలంలోని పలువురు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అందవలసిన ప్రతి లబ్ధి చేకూరేల తన సాయి శక్తులకు చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రతి పేదింటికి చేయూతనీ అందించే విధంగా చూస్తామని, అర్హులైన సభ్యులందరూ తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సకాలంలో అందించి ప్రభుత్వం తరఫున చేయూతని పొందాలని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమనీ, తప్పకుండా అన్ని రకాల పథకాలు అన్ని వర్గాల వారికి అందించి తీరుతామని ప్రకటించారు.