– పలు వార్డులలో లబ్ధిదారులకు అందజేత
సిరిసిల్ల (నేటి ధాత్రి):
పేద ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి అమలుపరుస్తుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని పలు వార్డులలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నలకు గతంలో పడ్డ బకాయిలు ఇప్పటికే విడతల వారిగా అందించామని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో, ఎంఆర్ఓ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మ్యాన ప్రసాద్, సూర దేవరాజు, యెల్లే లక్ష్మీనారాయణ, గడ్డం నరసయ్య, ఎండి ఖాజా, కౌన్సిలర్స్ శైలు, రామానుజం, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
