Indiramma Sarees Distributed Grandly in Shyampet
జోరుగా ఇందిరమ్మ చీరల పంపిణీ
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ప్రభుత్వ లక్ష్యం
సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోమహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని భూపాలప ల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అన్నారు. మం డల కేంద్రంలో హన్మకొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీకార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు హాజరై ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహి ళల అభ్యున్నతికి సీఎం రేవం త్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎన లేని ప్రాధాన్యత ఇస్తోందన్నా రు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ధృడ సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తు న్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదా లు, లోటుపాట్లకు తావులే కుండా ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా ప్రణాళికా బద్దంగా కృషి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆడబిడ్డలకు చీర,సారె పెట్టడం
మనసంప్రదాయమని అన్నా రు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు వారిని యజమానులను చేశామని అన్నారు. స్కూల్స్ యూనిఫాం లు కుట్టే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిం చామని అన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్ తో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కూడా మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కుటుంబ అభ్యున్నతిలో మహి ళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని ఎమ్మె ల్యే హితువు పలికారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్య క్రమం అనంతరం మండ లంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 18 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారు లకు రూ.5,23,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
