కోగిలేరు యానాది కాలనీవాసులకు ఇంటి పట్టాలు పంపిణీ
పెద్దపంజాణి(నేటి ధాత్రి)
అగస్టు 21:
చిత్తూరు జిల్లా
పెద్దపంజాణి
మండలంలోని కోగిలేరు యానాది కాలనీవాసులకు తహశీల్దార్ హనుమంతు ఇంటి స్థలాలకు సంబంధించిన దృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. మొత్తం 12గృహాలు వుండగా 6మంది లబ్ధిదారులకు నివాస ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. అలాగే 19జనన దృవీకరణ పత్రాలకు అర్హులుండగా 16మందికి జనన దృవీకరణ పత్రాలను మంజూరు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి, వీఆర్వో శివకుమార్, నాయకులు మురహరిరెడ్డి, చెంగారెడ్డి, నాగేశ్వరరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
