క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు పండ్ల పంపిణీ

వరంగల్, నేటిధాత్రి

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవమును పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యం.సాయి కుమార్ ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వరంగల్ జిల్లా న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి యం.సాయికుమార్ మాట్లాడుతూ “క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మంచి ఆహారపు అలవాట్లు, నిత్యం నడక వల్ల క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చు అని తెలిపారు. క్యాన్సర్ చికిత్స కొరకు ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండి, సరైన నియమ నిబంధనలు పాటిస్తే క్యాన్సర్ ను ఎదుర్కొనవచ్చును అని తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్ సురేష్, అసిస్టెంట్ కౌన్సిల్ ఆర్ రజిని, ప్రతిమ హాస్పిటల్ డైరెక్టర్ అవినాష్ తిప్పని, ఏ.జి.యం. మోహన్, హస్పిటల్ సిబ్బంది, వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *