
Devotees Begin Padayatra to Tuljapur with Fruit Distribution
భక్తులకు పండ్ల పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి;
జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన భక్తులు మహా రాష్ట్రలోని తుల్జాపూర్ భవానీమాత ఆలయా నికి పాదయాత్రగా తరలివెళ్తున్నారు. వీరికి న్యాల్కల్ మండలంలోని మల్లి గ్రామ మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి స్థానిక నాయకు లతో కలిసి శుక్రవారం స్వాగతం పలికి జాతీయ రహదారిపై పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు విట్టల్, దత్తు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని తుల్జా భవాని ఆలయం వరకు భక్తుల పాదయాత్ర
ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామం నుండి భక్తులు లోక కళ్యాణర్ధం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని తుల్జా భవాని ఆలయ వ్యవస్థాపకులు జాదవ్ మహేందర్ మహారాజు ఆధ్వర్యంలో భక్తులు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా తుల్జాపూర్ అమ్మవారి చెంతకు సుమారు 220 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రతి ఏడాది దీపావళి పర్వదిన అనంతరం పాదయాత్ర చేపడుతున్నట్లు గోపాల్ పేర్కొన్నారు.