
హనుమకొండ, నేటిధాత్రి (న్యాయ విభాగం):-
హనుమకొండ లోని ఉమ్మడి జిల్లా కోర్టులో శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ జరిగినది. ఇట్టి సందర్భంగా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320f రీజన్-1, వినూతన క్లబ్ హనుమకొండ గారి ఆధ్వర్యంలో కక్షిదారులకు 350 ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మల గీతాంబా గారు, హనుమకొండ జిల్లా ప్రధాన కోర్టు ఇన్చార్జ్ అండ్ మొదటి అడిషనల్ జిల్లా న్యాయమూర్తి బి.అపర్ణాదేవి గారు మరియు డి.ఎల్.ఎస్.ఎ న్యాయమూర్తి ఉపేందర్ గారు మరియు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ క్షామ దేశ్ పాండే గారు పాల్గొన్నారు. వీరితోపాటు ఇరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు వినూతన క్లబ్ ప్రెసిడెంట్ జయ శ్రీ, సెక్రటరీ డేవిడ్ రాజ్ కుమార్, ట్రెజరర్ డయాన్ శ్రీనివాసన్, జానకి ఇందిరా, సంతోష్, డిస్ట్రిక్ట్ లైన్ కే. వెంకట్ రెడ్డి, రమాదేవి మరియు న్యాయవాదులు నర్సింగరావు, సిరిమల్ల అరుణ, కొత్త రవి, నిర్మల జ్యోతి, ప్రవీణ్ సదానందం ఆహారపు పోట్లాలు మరియు మంచినీళ్ల ప్యాకెట్స్ ను పంచిన వారిలో ఉన్నారు.