లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ
జైపూర్,నేటి ధాత్రి:
చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం జైపూర్ మండలం మిట్టపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సన్నబియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.పేదల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పటికీ ప్రజలు ఎవరు తినలేని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజల సమస్య ను గుర్తించి నేడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలుపరచడం జరిగిందని,అదేవిధంగా ప్రజలందరూ కూడా సన్నబియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కొరకు మిట్టపల్లి గ్రామంలో 35 లక్షల అంతర్గత సీసీ డ్రైనేజీలు,ఈజిఎస్ నిధుల నుండి 15 లక్షలు,రెండు కోట్ల రూపాయలతో నర్వ నుండి మిట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం,వ్యవసాయ రైతులకు ఇబ్బంది పడుతున్నారనీ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు,ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది కలుగకూడదని ఐదు బోర్లుమంజూరు చేయడం జరిగిందనీ తెలిపారు.ప్రజల సమస్యలను క్షణక్షణం పరిశీలిస్తూ పేద నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి ఏ కష్టం వచ్చినా సమస్యను తీర్చుకుంటూ వారికి అండదండ నిలుస్తున్న ఎమ్మెల్యే కి కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం లింగయ్య,కామెర మనోహర్,అల్లూరి స్వామి,జంబిడి కిష్టయ్య,దూట శీను, చంద్రయ్య,మల్లేష్,గోదారి తిరుపతి,భిమిని తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.