వర్ధన్నపేట మండలంలోని,కడారిగూడెం గ్రామ రేషన్ షాప్స్ నందు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన…వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుంది.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదు.
సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం
–ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట (నేటిదాత్రి ):
ఈరోజు…వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని కడారిగూడెంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సన్న బియ్యం పంపిణీని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మాట్లాడుతూ…గౌరవనీయులు పెద్దలు వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వారు కల్పించిన అవకాశం మేరకు ఈరోజు కడారిగూడెంలో రేషన్ షాప్ నందు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని తెలిపారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని అలాగే పేద ప్రజల కడుపు నింపాలనే ఉద్దేశ్యంతో పేద ప్రజలకు రేషన్ షాప్ ల ద్వారా ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రత్మాకమని కొనియాడారు.
ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదని పేర్కొన్నారు.
ఇంత గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్చిపోకూడదని అన్నారు.
రాష్ట్ర ప్రజలందరి ఆదరణ, ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, సజావుగా సన్న బియ్యం పంపిణీ జరిగే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని అధికారులను కోరుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పింగిలి రాజ్ మల్లారెడ్డి, నాయకులు, వంగాల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాంపెల్లి రవీందర్,కాంగ్రెస్ పార్టీ మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, కుందూరు యాకూబ్ రెడ్డి,ఏలపాటి పెద్ద తిరుపతి రెడ్డి కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు