నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ
మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి
పరకాల నేటిధాత్రి
మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.