పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటిలో అంబేద్కర్ సెంటర్ రాజీపేట కాలనీకి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు పసుల శ్రీనివాస్ సోదరుడు పసుల లక్ష్మన్ సంగీత దంపతులు కుమార్తె అన్విక జన్మదిన వేడుకల్లో సందర్భంగా మంగళవారంరోజున పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని విద్యాలయ పబ్లిక్ స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడు,పెన్నులు స్కేల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శైలజ రమేష్ రాజీపేట కాలనీ యూత్ నాయకులు,ఒంటేరు కుమార్ ఒంటేరు రమేష్ ఒంటేరు చరణ్ రాజ్ గోవింద శ్రీనివాస్ మచ్చ సందీప్,పాఠశాల ఉపాధ్యాయులు నరసింహ(గోపీ) ఏకు రవి సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అన్విక జన్మదిన సందర్బంగా ఎగ్జామ్స్ ప్యాడ్స్,పెన్నుల పంపిణీ
