బోయినపల్లి సుధీర్ బాబు ట్రస్టు ద్వారా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చంద్రుగొండ మండలం. తిప్పనపల్లి గ్రామపంచాయతీ లోని మహమ్మద్ నగర్ గ్రామవాసు లకు హెల్పింగ్ హాండ్స్ బోయినపల్లి సుధీర్ బాబు ట్రస్టు ద్వారా రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు బోయినపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో గత ఏడు సంవత్సరాలుగా మహమ్మద్ నగర్ నందు నిత్యవసర వసతులు పంపిణీ చేయడం మంచి విషయం గా భావించడం జరిగిందని ట్రస్ట్ సభ్యులను ఎండి రజాక్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు,
రజాక్, రాజు, నాగభూషణం, కుమార్, గాలిబ్, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.