
Minister Konda Surekha birthday
మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
మహేశ్వర గార్డెన్స్ లో కేక్ కట్ చేసిన తూర్పు కాంగ్రెస్ నాయకులు. అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్. ఈ కార్యక్రమంలో తూర్పు కార్పొరేటర్లు, గణిపాక సుధాకర్, మీసాల ప్రకాశ్, సయ్యద్ మోసిన్, మహిళా నాయకురాళ్లు కొండా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.