
మహబూబాబాద్,నేటిధాత్రి:
మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను మరియు 06 కళ్యాణ లక్ష్మీ & 12 షాధి ముబారక్ చెక్కులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సహయ నిధి పథకంతో కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందుతోందని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందనే భావన తగ్గిందన్నారు.ఆడపిల్లల తల్లితండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశ్యంతో సి.ఎం. కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు.సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని,పనిచేసే ప్రభుత్వం వెనుక ప్రజలు ఉండి ఆశీర్వదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి,గద్దె రవి, చిట్యాల జనార్ధన్, మాదారపు సత్యనారాయణ, వీరు నాయక్, కాసిం, లింగాల పిచ్చయ్య మరియు
ప్రజా ప్రతినిధులు, భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.