
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో సోమవారం రోజున సీఎం ఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది చిట్యాల గ్రామానికి చెందిన అల్లం సునీత భర్త. మాదాసు దేవేందర్ తండ్రి బాబు లకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయి ఖర్చుల పాలైన వారికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గౌరవ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిలుకల రాజకొంరు. గంగాధర్ రవీందర్. గుర్రపు తిరుపతి. ఉయ్యాల రమేష్. గుర్రము నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.