
“CM Relief Fund Cheques Distributed in Lingampeta”
లింగంపేట లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు లింగంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శీనన్న సహకారంతో చెక్కులు మంజూరు చేయడం జరిగింది.
కొత్తపెళ్లి లావణ్య, గుడిసె రాములు, బండారు నరసవ్వ, మేకల పవిత్ర, యన్నం భవాని లబ్ధిదారులకు మొత్తం రూపాయలు 1,92,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కృష్ణ, ఇందూరి రాజు, బండారి శేఖర్, తర్రే గణేష్, ఇరుమల్ల నాగరాజు, గుడిసె నర్సయ్య, ఈగ రాజేశం, మేకల వెంకటేశం, పాశం లక్ష్మీనారాయణ, కొత్తపెళ్లి రామచంద్రం, శేఖర్, భూమయ్య, గుంట మనోజ్, శ్రీనివాస్, లింగాల ప్రభాకర్, తర్రే లక్ష్మీ రాజం, బుర్ర సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.