Village Committee Donates Chairs to Bar Association
గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కుర్చీలు వితరణ.
పలమనేరు(నేటి ధాత్రి)
https://youtu.be/LxKWVb_bkvU?si=ZXDva35PXFQXgffa
పలమనేరు పట్టణంలో గల ఫస్ట్ క్లాస్ సివిల్ కోర్ట్ బార్ అసోసియేషన్
కు శివాడి గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కుర్చీలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్ చేతుల మీదుగా వితరణ అందించినట్లు సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు, రామ్మూర్తి ,ధనంజయ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, నిరుపేదలకు అందిస్తున్న సేవల్లో భాగంగా పలమనేరు బార్ అసోసియేషన్‌కు కుర్చీలు ఇవ్వాలనే సంకల్పాన్ని నెరవేర్చమన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలకు తమ సేవలు విస్తరించి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులకు ఏ వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారో అధ్యాయనం చేసి వారి ద్వారానే తెలుసుకొని మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద మహిళలను గుర్తించి మా సంస్థ ద్వారా చేతి వృత్తులు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి వాటి ద్వారా వారి జీవనోపాదులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందించామని భవిష్యత్తులో తమ కార్యచరణను రూపొందించుకొని ప్రజలకు సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్,భాస్కర్ మాట్లాడుతూ గ్రామ సేవా సమితి తమ బార్ అసోసియేషన్ చేస్తున్న సేవలను గుర్తించి కుర్చీలు విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సేవ సమితి అధ్యక్షులు రామ్మూర్తికి శాలువ కప్పి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, మహిళా కార్యదర్శి మహేశ్వరి, న్యాయవాదులు రాజారెడ్డి, లక్ష్మణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
