ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికులకు మజ్జిగ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మందమర్రి ఏరియాలో ఎండ
తీవ్రత ఎక్కువగా ఉండుట వలన కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా రామకృష్ణాపూర్ ఉపరితల గని నందు కార్మికులకు సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.నేటి నుండి ప్రతి రోజు మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలియజేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి అధికారులు యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు , గని మేనేజర్ సుధీర్, రామకృష్ణపూర్ ఏఐటియుసి బ్రాంచి సెక్రటరీ ఆంజనేయులు, కార్మికులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!