జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గండ్ర జ్యోతి హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనంతరం గండ్రజ్యోతి మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిజాయితీతో చిత్త శుద్ధితో కార్యాచరణతో అభివృద్ధి పనులు చేస్తున్నాడు బతుకమ్మ చీరల పంపిణీ అనేది ఆడబిడ్డల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాడని ఇది గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా మహిళలకు వృద్ధాప్య పింఛన్, భరోసా కేసీఆర్ అంటే నమ్మకం ప్రతి మహిళకు అన్నగా ఎల్లవేళలా ఆశీర్వాదాలు ఉంటున్నాయని తెలియజేయడం జరిగింది.
కొన్ని పార్టీలు మీ దగ్గరకు వస్తున్నాయి భాజపా కాంగ్రెస్ పార్టీలను నమ్మితే మోసపోతామని ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరడమైనది .ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ , పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ , మండల సోషల్ మీడియా అధ్యక్షులు మామిడి అశోక్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్ పిఎసిఎస్ డైరెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, ,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాజే రాజేందర్, శంకరాచారి, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.