బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ శనివారం రోజు తడగొండ గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ చిందం రమేష్ ,ఉపసర్పంచ్ వరలక్ష్మి కనకయ్య ,మహిళలకు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు మహిళలకు నూతన దుస్తులు పంపిణీ చేస్తూ బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, కో ఆప్షన్ సభ్యులు,కార్యదర్శి మల్లేశం వివోఏలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.