రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.
రామయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కేంద్రీయ సమగ్ర వసస్యరక్షణ కేంద్రం – హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో పత్తి పంటలో వచ్చే చీడపీడలపై యాజమాన్య పద్ధతిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని సహాయ సస్యరక్షణ అధికారి నీలా రాణి రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్తి రైతులకు లింగాకర్షక బుట్టలు పంపిణీ చేసి వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం చే రూపొందించబడిన ఎన్ పి ఎస్ ఎస్ అని అప్లికేషన్ను రైతులు తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని పంటలలో వచ్చే చీడపీడల రోగాల గురించి అందులో పూర్తి సమాచారం ఉంటుందని , దీనివల్ల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.