తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతోమంది సీనియర్ నాయకులతో సంబంధం అనుభవం ఉందని అటువంటిది నేను ఓబులాపూర్ గ్రామ సర్పంచ్ గా మా భార్య విద్యా కమిటీ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో పదవులు చేశామని అలాంటి మమ్మల్ని పార్టీ పరంగా గుర్తుంచుకోవడం బాధాకరమైన విషయమని ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సేవకుడిగా పనిచేసిన అని అటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా నాకు తెలుపకపోవడం చేయడంతో పాటు నన్ను పార్టీ నుంచి దూరంగా ఉంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేతి గుర్తు నిర్మించాననికొందరు వ్యక్తులుదానిని ధ్వంసం చేశారని అప్పుడు కూడా నేను ఎంతో మనోవేదన గురయ్యానని దీనిపై పార్టీ పరంగా ఎన్నో విషయాలు జరిగాయని దాని విషయం గ్రామ ప్రజలకు తెలుసుననిఎవరైనా ఉద్దేశించి మాట్లాడడం లేదని దయచేసి నేను ఏమిటో మండల గ్రామ ప్రజలందరికీ తెలుసునని దయచేసి ఇట్టి విషయాన్ని ఎంతో బాధతో పత్రిక సమావేశంగా తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి జరిగిన విషయానికి తను చాలా బాధపడుతున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు