కల్వకుర్తిలో..ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
కల్వకుర్తి /నేటి ధాత్రి.

కల్వకుర్తి పట్టణంలో కొందరు వ్యాపారస్తులు ప్రభుత్వ ఆదేశాలను అధిక్రమిస్తున్నారని పట్టణవాసులు అన్నారు. స్థానికులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ నిబంధన ప్రకారం.. అనుమతి తీసుకుని, వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారని పట్టణవాసులు తెలిపారు. రాకపోకులకు పార్కింగ్ కు ఎలాంటి స్థలం వదలకుండా.. షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నారన్నారు. దీనివల్ల రాకపోకులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆర్డీఏంఏ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా… స్పందించిన అధికారులు మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. స్థానిక మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.