
Warangal District Collector Dr. Satya Sarada
హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి
రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి – అరుంధతి పట్నాయక్ ఎం.డీ (ఎన్ హెచ్ ఎం) ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టి.బి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పై సమీక్షించారు.వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి.సంధ్యరాణితో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,04,979 మంది ఉన్నారని వారికి 3,794 మందికి జూన్ 3 నుండి రెండో విడత టిబి,మరియు 8 రకాల వ్యాధి గ్రాస్తులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి, తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తున్న నేపథ్యంలో టీబీ రహిత జిల్లాగా మార్చుటకు మరింత తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.