రాత్రి కి రాత్రే లారీల్లో అక్రమంగా తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి లో ఎర్ర మట్టి గుట్టలను కొంతమంది మాయం చేస్తున్నారు. గ్రామంలోని ఫారెస్ట్ భూముల్లో గల ఎర్ర మట్టి గుట్టలను గుర్తించిన వారు పదిహేను రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జేసీబీతో తవ్వుతూ లారీల్లో వేరే ప్రాంతాల కు తరలిస్తున్నారు. అంతే కాకుండా రెండు రోజుల నుంచి ఫారెస్ట్ ను అనుకొని ఉన్న గుట్టలను మిషన్స్ తో రాత్రి సమయంలో గుట్టుగా బెందడు, కంకర తవ్వుతూ రాళ్లను తరలిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతు న్నారు. కోట్లాది రూపాయల మైనింగ్ మినరల్ మింగుతున్న అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు