అనారోగ్యం గురవుతున్న కాలనీవాసులు
మిషన్ భగీరథ అధికారులపై చర్యలు తీసుకోవాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదో వార్డులోని కృష్ణ కాలనీలో గత మూడు నెలలుగా మిషన్ భగీద నీళ్లు కలుషితమై వస్తున్న మునిసిపల్ అధికారులకు స్థానిక కౌన్సిలర్ కు చెప్పిన పట్టించుకోవడంలేదని స్థానిక వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
గత మూడు నెలలుగా స్థానిక ఐదో వార్డులో మురుకునీరు వస్తున్న స్థానిక కౌన్సిలర్ కు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు స్థానిక వార్డు ప్రజలు వాపోతున్నారు కలుషితమైన మిషన్ భగీరథ నీళ్ల వలన పిల్లలకు దొద్దుర్లు జరాలు వస్తున్నాయని మంచినీరు కొనుక్కొని తాగవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు అధికారులు పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు మా కాలనీ వాసులకు తాగునీరు అందించాలని అధికారులను కోరుతున్నాం ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు