డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం గ్రామంలో సిపిఎం శాఖ మహాసభకుఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ మహాసభకు మైల సత్తయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మునుగోడు, దేవరకొండ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులుసింగరాజుపల్లి,గొట్టిముక్కుల,చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లకు కొన్ని నిర్మాణ పనులు జరిగాయని, కానీఈ ప్రాజెక్టులకుపర్యావరణ,అటవీ శాఖ అనుమతులు ఇచ్చిమిగతా పనులు పూర్తి చేయుటకుతగిన నిధులు ప్రభుత్వంకేటాయించాలనిఆయన అన్నారు. జీవో ఎంఎస్ నెంబర్107 ద్వారా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఈ ప్రాంతానికి0.5 టీఎంసీ చొప్పున 60 రోజులు 30 టీఎంసీలు నీరు ఇవ్వనున్నట్లు జీవో ఇచ్చారని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాలోమూడు లక్షల 41 వేలఎకరాల ఆయ కట్టుకు నీరు ఇస్తానని చెప్పారు కానీ డిపిఆర్ ఆమోదించకపోవడం వలన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగడం లేదని ఆయన అన్నారు. ఏదుల్లా రిజర్వాయర్ నుండిమరో 27 కిలోమీటర్లుకాలువ తవ్వే పనికిఅనుమతులు ఇవ్వలేదన్నారు.రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకొచ్చిపది నెలలు అవుతున్నవీటిపై ఇంకా దృష్టి సారించకపోవడంశోచ నీయమన్నారు. మునుగోడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులపనులు త్వరగా పూర్తిచేసి,ఈ ప్రాంత ప్రజలకు త్రాగునీరు- సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శిఏర్పుల యాదయ్య,కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, గడగోటి వెంకటేష్, రుద్రాక్షి శ్రీరాములు, పిట్టల రమేష్, చొప్పరి హనుమంతు, గిరి విష్ణు, సురిగి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!