నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….
కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గానికి సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టిన దివ్యాంగుల సదరం క్యాంపు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. సిరిపుర గ్రామానికి చెందిన సంగన్న గారి వీర గౌడ్ గత మూడు సంవత్సరాలుగా మీ సేవ చుట్టూ తిరుగుతున్న స్లాట్ బుక్ కాకపోవడంతో సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఇంటికి వెళ్లి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగుల గురించి సంస్థ అధ్యక్షుడు శివశంకర్ రావు చేస్తున్న కృషిని అభినందించారు. దివ్యాంగులకు ప్రతి నెల 2000 నుంచి 3000 వరకు మందులు కోసం ఖర్చయితాయని సదరం సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల జీవితాంతం పెన్షన్ వచ్చి వేరొకరి పైన ఆధారపడకుండ.బతికే అవకాశాన్ని సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వారు కల్పించడం అభినందనీయమన్నారు. మొదటి రోజులో భాగంగా సిరిపుర, తెల్ల రాళ్ల తండ, గోవిందరాజు పల్లి, లింగాపూర్ గ్రామాల నుండి 12 మంది దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, డిసిసిబి అధ్యక్షులు దుర్గారెడ్డి, సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బి.వి.శివ శివశంకర్ రావు, వెంకట్ రెడ్డి,మచ్చ నరేందర్, నరోత్తం రెడ్డి. సారా పండు గౌడ్, సాయి కుమార్ గౌడ్, బాబు రాజు తదితరులు పాల్గొన్నారు.