
దిగల ఆత్మీయ సమ్మేళన సభ వాయిదా
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ వాయిదా వేస్తున్నట్లు మాదిగల ఐక్యవేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్ కమిటీ తెలియజేసింది. మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, రేపు (ఈ నెల 30) జరగనున్న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కవ్వoపల్లి సత్యనారాయణ, యాదయ్య, వీరేశం, విజయుడు తదితరులకు ఢిల్లీ లో ఇతర కార్యక్రమాలు ఉన్నట్లు తెలుపడంతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా లోని మాదిగ సోదరులు, నాయకులు ఈ విషయాన్ని గమనించాలని, తిరిగి కార్యక్రమ వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కత్తెర దేవదాస్, కట్టెకోల సుధాకర్, బొడ్డు నారాయణ, వంతడుపల్లి రాము, తంగళ్లపల్లి దేవయ్య, అంకని భాను,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.