
Criticism Over MLA’s Neglect of Hospital Issues
ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె???
మర్రి చెట్టుకున్న విలువ మనుషుల ప్రాణాలకు లేకపాయే???
పక్కనుండే వెళ్లిపోయినా ప్రజలు ఇక్కట్లను గుర్తు చేయని కోటరీ..
బురద నీటితో ఉన్న ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవటంలో ఆంతర్యం ఏమిటీ
సమయం లేకనా.. సమాచార లోపమా????
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఐలోని మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన శివాలమర్రి గా పేరుపొందిన 200ఏళ్ల నాటి మర్రిచెట్టు నేలకొరిగింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను మరియు దేవాదాయ శాఖ అధికారుల సమాచారం మేరకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హుటాహుటిన టెక్సబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి అట్టి శివాల మర్రి స్థలాన్ని సందర్శించారు. అన్ని శాఖల సమన్వయంతో నేలకొరిగిన ప్రతిష్టాత్మకమైన శివాలమర్రి ని మళ్లీ పున ప్రతిష్టాపన చేస్తామని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అదే అయినవోలు మండలంలో కురుస్తున్న గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షం నీరు రెండు గేట్ల వద్దనే నిలిచిపోయి లోపలికి వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్న కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. మర్రిచెట్టు నేలకొరిగింది అనగానే హుటాహుటిన బయలుదేరి వచ్చిన ఎమ్మెల్యే అదే మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారా. అంటే రోగులకు ఇక్కట్లు తలెత్తుతున్నాయన్నా కూడా ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చెప్పాలి.ఏది ఏమైనా ఒక చెట్టుకు ఇచ్చిన విలువ మనుషుల ప్రాణాలను కాపాడే ఒక ఆసుపత్రికి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.