వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గెస్ట్ హౌస్ ను మధ్యాహ్న భోజన కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మికులు గెస్ట్ హౌస్ ముందు ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నా కార్మికులకు ఏఐటియుసి నాయకులు కడారి రాములు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.