
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైంది రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని 70% మందికి రుణమాఫీ చేశారు కానీ మిగతా వారికి రుణమాఫీ చేయలేకపోయింది రైతులకు ఇప్పుడు వరకు రైతు భరోసా కింద ఎకరా 15000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయలేదు అని వారు ఆరోపించారు అనంతరం వీరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ రూరల్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్ వెంక రాణి సిద్దు పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ కౌన్సిలర్లు మమతా శ్రీనివాసు రవీందర్ నూనె రాజు బుర్ర రాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు