కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
ఇటీవల రాష్ట్రంలో కురిసిన తుఫాను వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కు మార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం వరద బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే వరద వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వరదల వల్ల నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఎన్నడు లేని విధంగా తుపాను వల్ల నష్టపోయిన ఈ విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం రైతులను నిరాశరీలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వరద బాధితుల పక్షాన అండగా ఉంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్ కుమార్, జిల్లా సమితి నాయకులు క్యాథరాజు సతీష్, మాతంగి రామచందర్ నూకల చంద్రమౌళి నేరెళ్ల జోసెఫ్ సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు