
Kyatharaju Satish
సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా
25వ వార్డులో రోడ్డుకు అడ్డంగా తీసిన కాలువను పూడ్చాలి
సిపిఐ పార్టీ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్
భూపాలపల్లి నేటిధాత్రి
స్థానిక కారల్ మార్క్స్ కాలనీ 25 వార్డులో ఉన్న సింగరేణి స్కూల్ 6వ గని మధ్యలో ఉన్న రోడ్డుకు అడ్డంగా సింగరేణి యాజమాన్యం తీసిన కాలువను వెంటనే పూడ్చాలని 25వ వార్డు కాలనీవాసులు జిఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొని సంఘీభావం తెలిపి అనంతరం జిఎం పర్సనల్ మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం నుండి కాలనీ ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిని అర్ధాంతరంగా మూసివేయడం తగదని అన్నారు స్కూలుకు వెళ్లే పిల్లలకు 6 ఇంక్లైన్ గణికి వెళ్లే కార్మికులకు.. అదేవిధంగా కాలనీ వాసుల కోసం నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ కి అనేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిని ఏదో స్టాకు చూపి మూసివేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.. గత కొన్ని సంవత్సరాలుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలన్నారు.. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ రోడ్డులో గత స్పీకర్ సిసి రోడ్ వేయించడం జరిగింది అన్నారు అప్పటినుండి ఆ రోడ్డుపై నిత్యం వందలాదిమంది ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు.. రోడ్డుకిరువైపులా చెట్లు ఉండడం మూలాన.. ఆ చెట్టు గుబురుగా పెరగడం జరిగిందన్నారు.. దాన్ని పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాన్ని పరిశుభ్రం చేయకుండా చెత్త చెదారం తొలగించకుండా ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న రోడ్డును అర్ధాంతరంగా మూసివేయడం అన్యాయం అన్నారు.. ప్రజల సౌకర్యం కోసం పాటుపడాల్సిన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఏంటని అన్నారు వెంటనే సింగరేణి యాజమాన్యం ఆ గుంతను పూడ్చి రోడ్డును పునరుద్ధరించాలని కోరారు