ఎస్సీ వర్గీకరణకు ధర్మసమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:రాష్ట్రంలో జరుగుతున్న కులగననకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ధర్మసమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వీణవంక మండల అధ్యక్షులు దాసారపు సదానందం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , రిజర్వేషన్లు అమలు అయిన నుంచి ఒక సామాజిక వర్గం మాత్రమే అన్ని రంగాలలో లబ్ధి పొందింది, కనుక ఎస్సీ వర్గీకరణ అనే డిమాండ్ సామాజిక న్యాయంగా ఉండాలి అంటే మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా అన్ని ఉపకులాలను లెక్కించి ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా ఇవ్వాలని అదేవిధంగా ఇక్కడ ఎక్కువ శాతం మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి సామాజిక న్యాయం చేయాలని ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల డీఎస్పీ నాయకులు సదానందం,రాకేష్,రాజేంద్ర ప్రసాద్,రవికిరణ్,రాజు,పృథ్విరాజ్,వినయ్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!