
పరకాల నేటిధాత్రి
ఉమ్మడి వరంగల్ జిల్లా, కేంద్రం లో ధర్మ సమాజ్ పార్టీ పట్ట భద్రుల ఎమ్మెల్సీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అభ్యర్థి బరిగెల దుర్గా ప్రసాద్ మహారాజ్ హాజరై మాట్లాడుతూ చదువుకున్న మేధావులు తలచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదనీ పట్ట బధ్రులు వేసే ఓటు అనే ఆయుధం ద్వారా మాత్రమే భారత దేశ ప్రగతిని సాధించ వచ్చునని.తద్వారా రాజ్యంగా న్ని కాపాడవలసిన అవసరం మనకు ఉంది. దళిత బహుజన రాజ్యాధికారం సాధించాలంటే సదువుకున్న విద్యా వంతులు అందరూ విజ్ఞాన వంతులు కావాల్సిన అవసరం ఉన్నదనీ అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ ఎన్నికల కరపత్రాలు? పోస్టర్ లను ఆవిష్కరించడం జరిగినది.ఈ సభలో డిఎస్పీ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ ఇన్చార్జి మేకల సుమన్, వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు మంద రమేష్, భూపాల పల్లి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు సదన్ మహారాజ్,ములుగు జిల్లా అధ్యక్షులు మల్యాల మనోహర్,సాయిబాబా, జిల్లా నాయకులు కట్కూర్ సునీల్, రవీ, ఏసోబు,రత్నాకర్, విష్ణు, శ్రావన్,వంశీ,పవన్,తరుణ్,సాగర్,రూప,జ్యోతి ,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.