కాంగ్రెస్ పార్టీని, నాయకులను విమర్శించే హక్కు ధర్మారెడ్డి కి లేదు

పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి.

పరకాల నేటిధాత్రి
పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీను ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పార్టీ మారిన వారితో పార్టీకి నష్టం లేదని విమర్శిస్తున్న నీకు కాంగ్రెస్ పార్టీని,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే చల్లాకు లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.నీలాంటి స్వార్థపరులను పరకాల ప్రాంతంలో ఉండకూడధనే ఉద్దేశంతో ప్రజలందరూ నిన్ను ఓడించారని ఈ ప్రాంతంతో సంబంధం లేని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నారని గుర్తు చేశారు.ఏ పని చేసినా నీ స్వార్థం కోసమే ప్రారంభించి నీ అనుచరులకు కట్టబెట్టిన ఘనత నీదని పరకాల అభివృద్ధి కాకుండా నిరోధించిన వ్యక్తి ఎవరంటే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అని ఆగ్రహించారు.శ్రీనివాస కాలనీలో కాలనీ కన్నా 6 ఫీట్ల ఎత్తు సైడ్ డ్రైనేజీ కాల్వను పెంచడం వర్షాకాలంలో శ్రీనివాస కాలనీ పరిస్థితి నీళ్లలో మునిగిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మీ స్వార్థం కోసం ఎత్తు పెంచి నీ కాంట్రాక్టు డబ్బుల కోసం కాలనీకి అన్యాయం చేశారని ఆ కాలనీకి ధర్మారెడ్డి వెళ్తే వారు తరిమి కొడతారని హెచ్చరించారు.ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేదని విమర్శిస్తున్న ధర్మారెడ్డికి వంద రోజులు కాకముందుకే తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కనపడతలేవా అని ప్రశ్నించారు.మీ ప్రభుత్వంలో ఎవరికైనా డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చారా ఆని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ 50 నుండి 80 లక్షల అప్పులపాలై ఆవేదన చెందుతున్న విషయం మీకు తెలవదాని వారందరినీ ముంచిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి అని సర్పంచులు తిట్టుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువదని చెప్తున్న ధర్మరెడ్డి మీ ఎంపీ అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి భయపడి ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా నిలబడేందుకు వ్యక్తి లేడని ఎద్దేవ చేశారు.రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి ఒక డిపాజిట్ కూడా రాదని చెప్పారు.నీవు ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉండవని త్వరలోనే పార్టీ మారుతావని అన్నారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సామాన్య ప్రజలకు న్యాయం చేసే వ్యక్తి అని ఆయన నర్సంపేటను ఎంతో అభివృద్ధి చేశాడని, ఇకనుండి పరకాల కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని అన్నారు.ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే చల్లా ధర్మ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరకాల మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, ఒంటేరు సారయ్య,ఏకు రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల్గూరి రాజేశ్వరరావు,ఓంటేరు రామ్మూర్తి,పసుల రమేష్, నల్లెలు అనిల్,మార్క రఘుపతి,కోడపాక కర్ణాకర్, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,పావుశెట్టి వెంకన్న, పల్లెబోయిన శ్రీనివాస్, గూడెం కృష్ణమూర్తి,నారగోని కుమారస్వామి,ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!