
మహబూబాబాద్ జిల్లా జనవరి 19
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక చేశారు. ఈ నూతన కమిటీలో కంచర్లగూడెం గ్రామానికి చెందిన ప్రస్తుత ఉప సర్పంచ్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ధరంసోత్ స్వప్నబాలు నాయక్ గారిని నియమించినట్టు ఆ సంఘం రాష్ట్ర కో కన్వీనర్ భీమా నాయక్ తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ భీమ నాయక్ మాట్లాడుతూ ధరం సోత్ స్వప్న గత పది సంవత్సరాలుగా ఎల్ హెచ్ పి ఎస్ నందు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అందరికన్నా ముందుండి సంఘాన్ని నడిపించడంలో తనదైన పాత్ర చూపించి అందరి మన్ననలు పొందారు. కావున ధరం సోత్ స్వప్నబాలు నాయక్ కి మహబూబాబాద్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తున్నాము. స్వప్న బాయి మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం భవిష్యత్తులో రాజి లేని పోరాటాలు నిర్వహిస్తానని, నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలకు కట్టుబడి ఉంటానని, సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్, గుగులోతు హరి నాయక్, రాష్ట్ర కో కన్వీనర్ గుగులోతు భీమా నాయక్ కి ధన్యవాదాలు తెలిపారు.