గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం సాయనపల్లి గ్రామ పంచాయితీ కార్మికుడు బొమ్మెర్ల రామూర్తి గ్రామ పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. మంగళవారం విధి నిర్వహణ లో మొక్కలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ మరియు ట్రాక్టర్ ఇంజన్ పల్టీ కొట్టడం తో మృతి చెందాడు. మృతదేహానికి ములుగు ఎమ్మెల్యే కొడుకు ధనసరి సూర్య పూల మాలతో నీవాళ్ళు అర్పించి ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. అలాగే వారి కుటుంబాన్ని అన్నీ విధాలుగా ఆదుకుంటాం అలాగే ప్రభుత్వం తరుపున చేయాల్సినవి చేస్తాం అని వారి కుటుంబాన్ని పరమర్శించి ధేర్యం చెప్పారు. ఇ కార్యక్రమములో ఎన్ఎస్ యుఐ గుండాల మండల అద్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ ,షేక్ అఫ్రోజ్ ,బుషనబోయిన రమేష్ , తాటి నితీష్ పాల్గొన్నారు.