
సురక్షిత ప్రయాణం చేసి క్షేమంగా చేరండి
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం మాందారిపేట కూడలి వద్ద ఈరోజు ఎస్సై దేవేందర్ సమక్షంలో జాతర ఫ్లెక్సీని కట్టడం జరిగింది మేడారం జాతర కోసం వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వాహనాలలో తరలి వెళ్తున్నందున రోడ్డు ప్రమాదాలను నివారించుటకు గాను ప్రతి వాహన చోదకుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించవలేనని , మరియు మూలమలుపుల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డు లను పెట్టి ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయడమైనది. మాందారిపేట సెంటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున వాహన చోదకులు వాహనాలను నిదానంగా నడిపి తిరిగి క్షేమంగా వారి గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా కోరడమైనది పోలీసువారి సూచనలు: మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు.
హెల్మెట్ , సీటు బెల్టును తప్పనిసరిగా ధరించాలి
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.
వేగం వద్దు ప్రాణం వద్దు.
రోడ్డుపై వాహనాలు నిలుప రాదు.
ట్రాఫిక్ రూల్స్ పాటించి గమ్యాన్ని క్షేమంగా చేరుకోండి. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు