
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని వెంచరామి కురుమపల్లి గ్రామ శివారులోని పూరేడు గుట్టలో జరిగే శ్రీ సమ్మక్క – సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుఅన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
భూపాలపల్లి డిపో కు చెందిన ఆర్టీసీ బస్సును చిట్యాల మండలం అందుకుతండ గ్రామం వద్ద బుధవారం రోజున ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం అదే బస్సులో అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే జాతర వరకు బస్సులో ప్రయాణం చేశారు.
అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను స్విచ్చాన్ చేసి ప్రారంభించి, అమ్మ వార్లను దర్శనం చేసుకున్నారు.ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు. మండల అధికారులు, జిల్లా కాంగ్రెస్ మండల నాయకులుతదితరులు పాలోన్నారు.