కోట గుళ్ళకు పోటెత్తిన భక్తజనం
తెల్లవారుజామున ప్రారంభమైన అభిషేకాలు, పూజలు
గణపేశ్వరునికి నందీశ్వరునికి రుద్రాభిషేకం
కొనసాగిన భక్తుల రద్దీ
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓఎస్ డి కిషన్ , డి.ఎస్.పి సంపత్ రావు సీఐ నరేష్ కుమార్ గణపురం ఎస్ఐ అశోక్
గణపురం:నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున గణపతి పూజ, అఖండ దీపారాధన తోరణ బంధనం కార్యక్రమాన్ని అర్చకులు గంగాధర్, నాగరాజు, శంకర్ లు నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఓఎస్ డి బోనాల కిషన్ దంపతులు , డి.ఎస్.పి సంపత్ రావు దంపతులు భూపాలపల్లి సీఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ దంపతులు అభిషేకంలో పాల్గొన్నారు. శివరాత్రి జాగరణ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.