
కట్టు దిట్టమైన భద్రత ఉన్న..
భద్రత సిబ్బంది వేప చెట్టు వద్ద కాలక్షేపానికే పరిమితం అవుతున్నారని భక్తుల ఆరోపణలు
ఆలయ అధికారులు భద్రత సిబ్బందిపై తీవ్రంగా మండిపడుతున్న రాజన్న భక్తులు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భద్రత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భక్తులు
వేములవాడ “నేటిధాత్రి”
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవా క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినటువంటి కొంతమంది భక్తులు ఆలయంలోని పిఆర్ఓ కార్యాలయం ముందు మద్యం స్రేవిస్తున్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్న వారు ఆలయ ప్రధాన ద్వారం ముందు వేప చెట్టు వద్దే కాలక్షేపానికి పరిమితం అవుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. నిరంతరం గస్తీ తిరగాల్సిన భద్రత సిబ్బంది భక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న పట్టుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోనే ప్రధాన ఆలయమైనటువంటి రాజన్న ఆలయంలో భద్రత చర్యలు ఇలా ఉంటే ఎలా అంటూ ఆలయ అధికారులతో పాటు భద్రత సిబ్బందిపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఆలయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భద్రత సిబ్బందిపై ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాజన్న భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతున్నారు..