అమ్మవారి అవతారాలు… అలంకరణలు.. విశిష్టతలు. శాయంపేట నేటి ధాత్రి:. శాయంపేట మండలం కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపు కుంటున్నారు. ప్రజలు భక్తి నిష్టతో అమ్మవారిని,9 రోజులలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 ప్రారంభమై అక్టోబర్ 24 తో ముగిస్తుంది శరన్నవరాత్రుల ప్రజలు అత్యంత భక్తి నిష్టతో దుర్గ మాతను పూజలు చేసి రోజుకో అలంకరణతో అమ్మవారిని ఇష్టమైన పుష్పాలు వేసి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు.ఈ ఏడాది మొదటిరోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు, రెండవ రోజు శ్రీగాయత్రీ దేవి, మూడవరోజు శ్రీ అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు శ్రీమహాలక్ష్మి దేవి, ఐదవ రోజు శ్రీసరస్వతి దేవి ఆరవ రోజు శ్రీలలిత త్రిపుర సుందరీ దేవి ఏడవరోజు శ్రీ దుర్గాదేవి ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దినిదేవి మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజిస్తారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజలు, మహిళలు అధిక మొత్తంలో పాల్గొంటున్నారు