భవాని దీక్ష స్వీకరించే భక్తులు అర్చకులను సంప్రదించండి-ఆలయ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు
పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మొదలుకొని అశ్వయుజ శుద్ధ ఏకాదశి మంగళవారం వరకు శ్రీదేవీ శరన్నవరాత్ర మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అందుకుగాను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అంగ రంగ వైభవoగా నిర్వహించుటకు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆచార్యతమున ఉత్సవ దినములను నిర్వహించుటకు గాను ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు చైర్మెన్ గందె వెంకటేశ్వర్లు తెలుపడం జరిగింది.ఆదివారం రోజున ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ,ఉత్సవ
అనుజ్య,విగ్నేశ్వర పూజ,పుణ్యాహవాచనము,
పంచగవ్య ప్రాశన, దేవి దీక్షా ధారణ,మత్స్య0 గ్రహణ అంకురారోపణ,అఖండ దీప స్థాపన,మంటపార్చన ,ప్రధాన కలశ స్థాపన,వాస్తు పూజ ,అగ్ని ప్రతిష్ట,పర్యగ్నికరణ,శ్రీ భవాని రాజరాజేశ్వరి అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకము,పీఠా దేవత,ఆవరణ దేవత,ఆవాహనము,నిత్యాహికము,నవరాత్ర వ్రత ప్రారంభము,అమ్మవారి శైలపుత్రి క్రమంలో శ్రీ స్వర్ణకవచా లంకృత దుర్గాదేవి అలంకరణము.
16 సోమవారం రోజున నిత్యాహన్నికము,బ్రహ్మచారిని క్రమంలో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణము,17 మంగళవారం రోజున నిత్యాహీన్ కము,చంద్రగంటా క్రమంలో శ్రీ గాయత్రీ దేవి అలంకరణము,తేదీ 18 బుధవారం రోజున నిత్యానికము,కుష్మాండ దుర్గా క్రమంలో అన్నపూర్ణాదేవి అలంకరణ,తేదీ 19 -10- 2023 గురువారం రోజున నిత్యాన్నికం,స్కందమాత క్రమంలో లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ,తేదీ 20 శుక్రవారం రోజున నిత్యానిహికము కాత్యాయనీ క్రమంలో శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ,తేదీ 21 శనివారం రోజున సామూహిక కుంకుమార్చనలు కాలరాత్రి క్రమంలో శ్రీ సరస్వతీ దేవి మూలా నక్షత్రము అలంకరణ,తేదీ 22 ఆదివారం రోజున నిత్యానిహికము మహా గౌరీ క్రమంలో దుర్గా దేవి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ,తేదీ 23 సోమవారం రోజున మహర్నవమి ,విజయదశమి దసరా సిద్దిధాయిని క్రమంలో శ్రీ మహిషాసుర మర్ధిని దేవి,శమీ పూజ,అపరాజిత పూజ,ఆయుధ పూజ,వాహన పూజలు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి కైంకర్యములు నిర్వహించబడునని,తేదీ 24 మంగళవారం రోజున త్రిశూల స్నానము మాదాశీర్వచనము జరుగునని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ చైర్మన్ కోరడం జరిగింది.త్రిశూలస్నానం కొరకు దంపతులకు మాత్రమే ఉచిత టోకెన్లు తీసుకోగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ వంశానిగత అర్చకులు కోమళ్ల పల్లి నాగభూషణ శర్మ,కార్యనిర్వహణాధికారి వెంకటయ్య,ఆలయ ధర్మకర్తలు ఏకు రఘుపతి,కందుకూరి శ్రీథర్,పోచు సుజాత-రాజు, భక్తులు పాల్గొన్నారు.