
Record Bids at Kalwakurthy Devi Navaratri
కల్వకుర్తిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు.
రికార్డ్ ధరలకు అమ్మవారి చీరలు వేలం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత తొమ్మిది రోజులుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారము అమ్మవారి లడ్డును వేలంపాట నిర్వహించారు. ఉర్కొండ మండలం ఇప్పపహట గ్రామానికి చెందిన వీరమల్ల బాలస్వామి రూ.82,116 వేలకు దక్కించుకున్నారు. అలాగే అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు మొదటి రోజు ధాన్యలక్ష్మి దేవి చీరను గార్లపాటి శ్రీనివాసులు రూ.58, 116, రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ చీరను బాదం గణేష్ రూ.53,1 16, మూడవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చీరను రామస్వామి రూ.65, 116, నాలుగవ రోజు కాత్యాయన దేవి అలంకరణ చీరను గంప వెంకటేష్ రూ.49, 116, ఐదవ రోజు ధనలక్ష్మి దేవి అలంకరణ చీరను1,35,116, ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ చీరను పోలా పర్వతాలు రూ.77,116, ఏడవ రోజు శాకాంబరి అలంకరణ చేరను కూన శ్రీనివాసులు రూ. 61,116 ఎనిమిదవ రోజు సరస్వతి దేవి అలంకరణ చీరను గంప శ్రీనివాసులు రూ.61, 116, తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకరణ చీరను కొరివి శ్రీనివాసులు రూ.92, 116 పదవరోజు మహిషాసుర మర్ధిని దేవి అలంకరణ చీరను వీరమల్ల పాండు రూ.70, 116 11వ రోజు పుష్పలంకరణ చీరను గంప సురేందర్ రూ.55, 116, అమ్మవారి వడిబియ్యం వేముల శ్రీనివాసులు రూ. 46,116 వేలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాఠం లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.