మహారాష్ట్ర కొత్త సీఎంపై క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఆమోదించారు. గురువారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎన్డీఏ కీలక నేతలు దీనికి హాజరుకానున్నారు. సీఎంగా ఫడణవీస్తో పాటు శివసేన నేత ఏక్నాథ్ శిందే , ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మనకు కొన్ని అనుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉంటాయని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. అయితే రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఫఢ్నవీస్ ఈ ప్రకటన చేశారు.